బెట్టింగుల జోలికి వెళితే కఠిన చర్యలు:ఎస్సై నాగమల్లేశ్వర రావు
కంభం న్యూస్ ఇండియా
యువకులను బ్రమ పెడుతూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని అర్ధవీడు ఎస్సై నాగమల్లేశ్వర రావు స్థానిక మండల ప్రజలను, యువకులను హెచ్చరించారు. ఐ.సి.సి క్రికెట్ ప్రపంచ కప్ 2023 నేపథ్యంలో మండలం లో పోలీస్ నిఘా బలపరచి విస్తృతంగా తనిఖీలు చేయటం జరుగుతుందని, బెట్టింగ్ అంటూ పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్సై నాగమల్లేశ్వర రావు అన్నారు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించనని హెచ్చరించారు. ఏ.పి జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్సై నాగమల్లేశ్వర రావు అన్నారు.
Comment List