ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులు
మార్కాపురం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజ్ సమీపంలో అసైన్మెంట్ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకొన్న విషయంపై వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్ది రెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చిన విషయం అందరికీ విదితమే.అయితే దానిపై స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం పెద్దిరెడ్డి ప్రస్తావించిన సర్వే నెంబర్లలో ఉన్న ఆక్రమణలు తొలగించి స్వాధీన పరచుకున్నారు.అలాగే గతంలో వీఆర్వో లు సస్పెండ్ అయిన వ్యవహారంలో అక్రమంగా ఆన్లైన్ అయినా ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు అందించాలని పేదల పక్షాన పెద్దిరెడ్డి అధికారులకు కోరారు.అక్రమంగా ప్రభుత్వ భూములను రాత్రి కి రాత్రి ఆన్లైన్ చేసుకున్నా అక్రమార్కుల పేర్లు ఆన్లైన్ నందు తొలగించి ప్రభుత్వ భూములను సంరక్షించాలని పెద్ది రెడ్డి రెవిన్యూ అధికారులకు డిమాండ్ చేశారు.
Comment List