ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

On

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు నుంచి ఆర్డర్‌ కాపీ బుధవారం సాయంత్రం విడుదల అయ్యింది. సిట్‌ను రద్దు చేస్తూ.. సీబీఐకి ఎమ్మెల్యే కొనుగోలు బదిలీ చేస్తున్నట్లు అందులో పేర్కొంది హైకోర్టు సింగిల్‌ బెంచ్‌. అలాగే.. 98 పేజీల సుదీర్ఘమైన ఆర్డర్‌ కాపీలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు హైకోర్టు జడ్జి. అందులో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ కూడా ఉండడం గమనార్హం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పే. కానీ, సిట్‌ […]

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు నుంచి ఆర్డర్‌ కాపీ బుధవారం సాయంత్రం విడుదల అయ్యింది.

సిట్‌ను రద్దు చేస్తూ.. సీబీఐకి ఎమ్మెల్యే కొనుగోలు బదిలీ చేస్తున్నట్లు అందులో పేర్కొంది హైకోర్టు సింగిల్‌ బెంచ్‌.

అలాగే.. 98 పేజీల సుదీర్ఘమైన ఆర్డర్‌ కాపీలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు హైకోర్టు జడ్జి. అందులో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ కూడా ఉండడం గమనార్హం.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పే. కానీ, సిట్‌ పరిధి దాటి వ్యవహరించింది.

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ని బహిర్గతం చేశారంటూ.. సిట్‌ ఉనికిని ప్రశ్నించింది బెంచ్‌. అసలు ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందంటూనే..

Read More ఉన్నతి కోసం యువత శ్రమించాలి...

దర్యాప్తు సమాచారం సీఎంకు చేరడంపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే.. దర్యాప్తు అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి , ప్రజల వద్దకు వెళ్లిపోయాయని అసహనం వ్యక్తం చేస్తూ.. సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి 45 అంశాలను ఆర్డర్‌ కాపీలో చూపించింది.

Read More అనాధలకు అండగా

కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని ఆర్డర్‌ కాపీలో న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫేయిర్‌ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపించలేదని తెలిపింది. ‘‘దర్యాప్తు ద్వారా వెల్లడైన ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు.

ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చు.

బీజేపీ పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో పిటిషన్ డిస్మిస్ చేశాం. అయితే.. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను మాత్రం పరిగణలోకి తీసుకున్నాం అని న్యాయమూర్తి ఆ ఆర్డర్‌ కాపీలో పేర్కొన్నారు.

జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తూ.. ఎఫ్ ఐ ఆర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేయడంతో పాటు సిట్ చేసిన దర్యాప్తును

సైతం రద్దు చేస్తున్నట్లు ఆ ఆర్డర్‌ కాపీలో న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో 26 కేసుల జడ్జిమెంట్లను అందులో ప్రస్తావించారు.

Views: 15
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List