చైనా దాచేస్తుందా?

On

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్… మళ్లీ పంజా విసురుతుంది. కరోనా పుట్టినిల్లు చైనాను మరోసారి వణికిస్తోంది. చైనాలో కేవలం 20 రోజుల్లోనే 250 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో కేసులు తీవ్రతరం కావడం ఆందోళన కల్గిస్తోంది. చైనాలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక […]

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్… మళ్లీ పంజా విసురుతుంది.
కరోనా పుట్టినిల్లు చైనాను మరోసారి వణికిస్తోంది.
చైనాలో కేవలం 20 రోజుల్లోనే 250 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనాలో కేసులు తీవ్రతరం కావడం ఆందోళన కల్గిస్తోంది. చైనాలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది.
అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక ఈసారి లీక్ అయింది.
చైనా ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్‌సి సమావేశం నుండి లీక్ అయిన పత్రాలను చూసినట్లు అమెరికన్ న్యూస్ ఛానెల్ తెలిపింది.
జిన్‌పింగ్ ప్రభుత్వ రహస్య డేటా లీక్ కావడంతో చైనాలో కలకలం రేగింది. చైనాలో కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో లీక్ అయిన నివేదికను బట్టి అంచనా వేయవచ్చు.
కరోనాతో చైనా పరిస్థితి దారుణంగా మారింది. చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ మొదటి 20 రోజుల్లో 250 మిలియన్లకు బదులుగా 62వేల 592 కొత్త కోవిడ్ కేసులను మాత్రమే నివేదించిందని ఆ రిపోర్టుతో తేటతెల్లమైయ్యింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!