ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు అవసరం లేదా..?
ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
గ్రౌండ్ లేదు ఫైర్ సేఫ్టీ నిల్..
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )జనవరి18: చిన్న బండి కొట్టు పెట్టుకోవాలంటే సవాలక్ష నియమాలు, అనుమతులు, కానీ భారీ ఎత్తున పెట్టే స్కూళ్ల కు అనుమతులు అవసరం లేదనుకుంటా..? అధికారుల మౌనం వెనుక అంతర్యం ఏమిటి...? కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర బస్తీలో ఉన్న ప్రవేట్ పాఠశాల ఎస్ ఆర్ కె టి స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనే సందేహం పలువురిలో కలుగుతుంది. 20 అడుగుల దూరంలో ఒక ప్రైవేట్ స్కూలు ఉన్నప్పటికీ అదే ప్రాంతంలో ఎస్ ఆర్ కే టి పేరుతో స్కూల్ పెట్టడం విమర్శలకు తావిస్తుంది. ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటే చుట్టూ ప్లేగ్రౌండ్ తోపాటు ఫైర్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఇవేమీ లేకుండానే ఎస్ ఆర్ కే టి స్కూల్ పేరుతో బిల్డింగ్ కు బోర్డు తగిలించి అడ్మిషన్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బోధించే వారి నియామకాలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి..? నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారనే ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ ఆర్ కే టి పాఠశాల ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలపై టౌన్ విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభు దయాల్ ను వివరణ కోరగా ప్రారంభానికి అనుమతులు ఉన్నాయి పాఠశాల నిర్వహణకు మాత్రం అనుమతులు లేవని చెప్పారు. గాలి వెల్తురు లేకుండా ఇరుకు గదులలో విద్యార్థులకు పాఠాలు బోధించడంతో విద్యార్థుల మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comment List