అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

రోగులకు వరంగా ప్రభుత్వ దావఖాన

On
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 8: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా మారుతుంది. బోలెడు అంత డబ్బులు పోసి ప్రైవేట్ లొ హాస్పిటల్ చూయించుకోలేని నిరుపేదలు ఎందరో.. వారికి బాసటగా నిలుస్తూ, మనో ధైర్యం కల్పిస్తూ  ప్రభుత్వ దావఖాన లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..  ఇటీవల ఎటపాక మండలం బుజ్జిగూడెంకు చెందిన 30 సంవత్సరాల మహిళ రొమ్ము క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ  గత నెల  కొత్తగూడెం సర్వేజనా ఆస్పత్రిలోని వైద్యుల సంప్రదించగా వైద్య పరీక్షలు నిర్వహించి రొమ్ము క్యాన్సర్ గాని నిర్ధారించుకొని,Left breast Modified Radical Mastoidectomy (MRM) అరుదుగా నిర్వహించే శాస్త్ర చికిత్సలో రొమ్ము క్యాన్సర్ చికిత్స ఒకటి కాగా, ఆ మహిళకు ఎడమ పక్క రొమ్ము క్యాన్సర్ ఉండగా, ఆ భాగాన్ని ఆపరేషన్ నిర్వహించి వైద్యులు తొలగించారు . మళ్లీ తిరిగి నేడు  వైద్యులను సంప్రదించగా క్యాన్సర్ సంబంధించి కానీ ఆపరేషన్ సంబంధించి గాని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఓడి , రాంప్రకాష్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అనేస్తేటిస్ట్ మురళీకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ విజయ్ కుమార్, సిబ్బంది స్రవంతి, శిరీష, హేమ, రమేష్ పాల్గొన్నారు.

Views: 308
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....? ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్ )జనవరి 9:కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదర బస్తీలో ఉన్న ప్రవేట్ పాఠశాల  ఎస్ ఆర్ కె టి స్కూల్ కి అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనే...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం
భద్రాచలంలో రేపే ముక్కోటి వైకుంఠ ఏకాదశి
నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవు :ట్రాఫిక్ ఎస్సై నరేష్
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి: సిఐ కరుణాకర్
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 
కొత్తగూడెం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం