కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
పాల్గొన్న జిల్లా ఎస్పి రోహిత్ రాజు
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం
కొత్తగూడెం (న్యూస్ఇండియా నరేష్) అక్టోబర్ 28: కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్ నందు సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని, రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కొత్తగూడెం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అన్నారు. అక్టోబర్ 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్కరణ దినం పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ, ఓపెన్ హౌస్, రక్తదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడుకోగలుగుతామన్నారు. కొత్తగూడెంలో రక్తదానానికి సంబంధించి చాలా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రక్తదానాన్ని అందించడం చాలా సంతోషకరమన్నారు. రక్తదానం చేయడం వలన కొత్త రక్తం మన శరీరంలోకి వస్తుంది అన్నారు. దానివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నారు. వారోత్సవాల సందర్భంగా కాకుండా తరచుగా రక్తదానం చేయడం మంచిదన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల సేమియా, సికిల్ సెల్, అనిమియా బాధపడుతున్న వారికి రక్తం అవసరం ఉన్నందున, రక్తదానం చేయండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఎస్.కె అబ్దుల్ రెహమాన్, సిఐలు, ఎస్సైలు, రెడ్ క్రాస్ డాక్టర్ స్వామి, పోలీస్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comment List