మహబూబాబాద్ పట్టణం ఏబి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా
తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లేదారిలో ఉన్న ఏ బి ఫంక్షన్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో తేదీ 8-10-2024 రోజున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తొర్రూర్ పట్టణ సీఐ కే జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన యువతీ యువకులకు ఈ జాబ్ మేళా ద్వారా పాల్గొంటున్న 40 కి పైగా వివిధ కార్పొరేట్ కంపెనీలలో రెండు వేల ఉద్యోగాలు ఉంటాయని వాటిని సాధించేందుకు పైన తెలిపిన QR కోడ్ ద్వారా online లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆసక్తి గల అభ్యర్థులను కోరారు. ఈ జాబ్ మేళా ఉదయం 9 గంటల వరకే వారి యొక్క సర్టిఫికెట్లతో ఫంక్షన్ హాల్ కు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు మండల నిరుద్యోగ యువతీ యువకులను వారు కోరారు. అంతేకాకుండా ఈ ఉద్యోగాలలో ఎంపికైన వారికి 12 వేల రూపాయల ప్రారంభ కనీస వేతనంతో ఉపాధి పొందవచ్చు అని తెలిపారు.
Comment List