"న్యూస్ ఇండియా పత్రిక కథనానికి" ఎస్ఐ నిరంజన్ రెడ్డి స్పందనకు వందనం...!
-ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి...
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 20 :- శుక్రవారం రోజు న్యూస్ ఇండియా పత్రికలో ప్రచురితమైన "బడి పిల్లల ఆటో భద్రమేనా- ప్రమాదపుటంచున విద్యార్థుల ప్రయాణం...!" అనే శీర్షిక పై స్పందించిన పెద్దకడుబూరు మండలం ఎస్ఐ నిరంజన్ రెడ్డి న్యూస్ ఇండియా పత్రిక విలేకరితో మాట్లాడుతూ మండలంలోని ఆటో డ్రైవర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తానన్నారు. అదేవిదంగా శనివారం పెద్దకడుబూరు లోని ఆటోలు నడుపుతున్న డ్రైవర్లను స్టేషన్ వద్దకు పిలిచి వారికి ఘట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మండలం నుంచి వివిధ పట్టణాలకు మరియు గ్రామాలకు ఆటోలలో ప్రయాణం చేస్తున్న ప్రయానికులను సురక్షితంగా వారిని గమ్యాన్ని చేర్చాలని డ్రైవర్లను హెచ్చరించారు. రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్లు అతివేగంగా వాహనాలను నడపరాదనీ, వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదనీ, ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులను ఎక్కించుకొని వాహనాలు నడిపే డ్రైవర్లు చాలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అతివేగంతో వాహనాలు నడిపి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ప్రమాదానికి గురైన కుటుంబాలు రోడ్డున పడతాయని డ్రైవర్లు ఆలోచించాలని అన్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ యూనిఫామ్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబందించిన రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. మండలంలో వాహనాలు నడిపే ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. న్యూస్ ఇండియా తెలుగు పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన పెద్దకడుబూరు మండలం ఎస్ఐ నిరంజన్ రెడ్డి స్పందనకు వందనం...
Comment List