కొత్తగూడెం బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

సమస్యలపై వారం లోపు నివేదిక అందించాలి

On
కొత్తగూడెం బస్టాండ్ ను  ఆకస్మికంగా తనిఖీ చేసిన  కలెక్టర్

బస్టాండ్ లో వాహనాలు పార్కింగ్ చేస్తే రుసుము తీసుకోండి

IMG20240918110603కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) సెప్టెంబర్ 18:IMG20240918111924 కొత్తగూడెం బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ జితేష్ జి పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ప్లాట్ ఫారంపై ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిల్డింగ్ పైన ఉన్న స్లాబ్ పెచ్చలను పరిశీలించారు. పారిశుభ్రత పై అధునాతన పరికరాలను ఏర్పాటు చేసుకోవడానికి తగిన ప్రతిపాదన రూపొందించాలన్నారు. బస్టాండ్ లోపల ఉన్న క్యాంటీన్ టెండర్ పూర్తవుగానే మహిళా శక్తికి కేటాయిస్తామన్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రయాణికుల పిల్లల కోసం ఆటసామాగ్రి వస్తువులను ఏర్పర్చుకోవడానికి ప్రతిపాదన , బస్టాండ్ సమస్యలపై వారం లోపు నివేదిక తయారు చేయాలని కలెక్టర్ , మేనేజర్ దేవేందర్ గౌడ్ ను ఆదేశించారు. పారిశుభ్రత కార్మికులకు డ్రెస్ కూడా ఏర్పాటు చేసి వారి మీద భారం పడకుండా నూతన టెక్నాలజీ పరికరాలను ఎంజీబీఎస్ బస్టాండ్ తరహాలో ఏర్పాటు చేయడానికి మేనేజింగ్ డైరెక్టర్ తో సంప్రదిస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

Views: 221
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News