సమయపాలన పాటించని ఎపిజిబి బ్యాంకు మేనేజర్ రంగప్ప...?

బ్యాంక్ మేనేజర్ రంగప్ప ని సస్పెండ్ చేయాలనీ - సిపిఐ ప్రత్యేక డిమాండ్.

On
సమయపాలన పాటించని ఎపిజిబి బ్యాంకు మేనేజర్ రంగప్ప...?

- సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ వెల్లడి....

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 17 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్ గా రంగప్ప విధులు నిర్వహిస్తున్నారు. అయితే మేనేజర్ రంగప్ప చేస్తున్న ఉద్యోగం పట్ల ఏమాత్రం సమయపాలన పాటించడం లేదని ప్రతిరోజు కూడా ఆలస్యంగా బ్యాంకు కు హాజరువుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆఫీసు నందు మంగళవారం విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ మరియు సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ నాయుడు మాట్లాడుతూ పెద్దకడబూరు మండలంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో విధులు చేస్తున్న బ్యాంక్ మేనేజర్ ఖాతాదారుల పైన దురుసుగా మాట్లాడుతున్నారని, ఆయన ఇష్టానుసారంగా సెలవు పేరుతో బ్యాంకు కు డుమ్మాలు కొట్టడం, బ్యాంకులో ఆయన ప్రవర్తన చూస్తే తన సొంత ఇల్లు మాదిరిగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటుగా ఉందన్నారు. ఖాతాదారులు ఎవరైనా తమ అకౌంట్ సమస్యలపై బ్యాంకు కు వెళ్తే వారితో అసంతృప్తిగా మాట్లాడుతూ రేపు రా ఎల్లుండి రా అని అంటున్నారని, ఖాతాదారులకు బ్యాంకులో లోన్లు ఇవ్వాలన్న రికమండేషన్ పెట్టుకొని వాళ్ళతో లావాదేవాలు నడుపుతున్నరన్నారు. పెద్దకడబూరులోని బ్యాంక్ మేనేజర్ రంగప్ప పై చర్యలు తీసుకోవాలని ఎపిజిబి కడప హెడ్ ఆఫీస్ అధికారులను కోరారు. ఈ విషయంపై సంబందిత అధికారులు వెంటనే స్పందించకపోతే దశలవారీగా ఉద్యమం చేపడతామన్నారు. వెంటనే బ్యాంక్ మేనేజర్ రంగప్ప ని సస్పెండ్ చేసి మరొక కొత్త మేనేజర్ ను నియమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రత్యేకంగా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తిక్కన్న, ఎఐవైఎఫ్ జాఫర్ పటేల్, రెక్కల గిడ్డయ్య, భాషా, వీరాంజనేయులు, గోపాల్, తిక్కన మరియు తదితరులు పాల్గొన్నారు.IMG-20240917-WA0234

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List