నా కుమారుడి చావుకి కారణమైన వైద్యులపై...హత్య కేసు నమోదు చేయాలి

అమృత క్రిటికల్ కేర్ హాస్పిటల్ ను సీజ్ చేయాలని డిమాండ్

On

విలేకరుల సమావేశంలోకన్నీటి పర్వంతో తండ్రి మంద వెంకటేశ్వర్లు ఆవేదన...

IMG20240831124601కొత్తగూడెం (న్యూస్ ఇండియా) ఆగస్టు 31: అనారోగ్యంతో వైద్యం కోసం నా కుమారుడు మంద రాకేష్ (25)నడుచుకుంటూ.... అమృత క్రిటికల్ కేర్ హాస్పిటల్ కు తీసుకెళ్లాం ...డాక్టర్ ఇరుకు బాబురావు, డాక్టర్ సీతారాం ప్రసాద్, డాక్టర్ వరగాని జయ పరీక్షించి, రక్త పరీక్షలు నిర్వహించిన అనంతరం డెంగ్యూ వ్యాధి సోకిందని తెలిపారు. అనంతరం తండ్రి మంద వెంకటేశ్వర్లు ....ఎలాగైనా నా కుమారుని బతికించుకుంటాను ఆని ...మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్తానని... వైద్యులతో తెలపగా..వారు నిరాకరించి మెరుగైన వైద్యం మేము అందిస్తామని నమ్మించి సరైన వైద్యం చేయకుండా నా కుమారుడిని నిర్దాక్షిణ్యంగా నా కుమారుని చావు కారణమయ్యారని ...శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాకూ న్యాయం కావాలంటూ, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కావద్దంటూ... బోరున విలపించిన ఓ తండ్రి ఆవేదన ... వివరాలలోకి వెళ్తే ... చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ  రాంనగర్ చెందిన మంద వెంకటేశ్వర్లు తన కుమారుడైన మంద రాకేష్ అనారోగ్యంతో ఉండగా గత ఏడాది సెప్టెంబర్ 7 వ తేదీన కొత్తగూడెం లోని అమృత క్రిటికల్ కేర్ హాస్పిటల్ వైద్యులైన ఇరుకు బాబురావు వద్దకు తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి డెంగ్యూ గా నిర్ధారించారు. అనంతరం తండ్రి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేదా ఖమ్మం తీసుకెళ్తానని డాక్టర్ కు తెలుపగా. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కావలసిన సౌకర్యాలు మా హాస్పిటల్ లో ఉన్నాయని మాయమాటలు చెప్పారని, ఇతర వైద్యులైన డాక్టర్ సీతారాం ప్రసాద్, డాక్టర్ వరగాని జయలక్ష్మి కలిసి నిర్లక్ష్యమైన వైద్యం అందించారని. దానివల్ల చేతికి అందిన నా కొడుకు మరణించాడని కంటతడి పెడుతూ గొడును వ్యక్తపరిచాడు. అట్టి విషయమై ఆనాడు కొత్తగూడెం పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అట్టి హాస్పిటల్లోని వైద్యులపై ఫిర్యాదు చేయగా. వారిపై కేసు నమోదు చేశారని తెలిపాడు. అంతేకాకుండా ఇట్టి విషయంపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ ఒక కమిటీని నియమించి, దర్యాప్తు చేయించగా, కమిటీ నా కుమారుడి చావుకి వైద్యుల్ కారణమని నిజానిరాదరణ కమిటీ తేల్చారని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వలన నా కుమారుని కోల్పోయిన ఆవేదన మరొకరికి రాకూడదని సంబంధిత హాస్పిటల్ ను సీజ్ చేసి, వైద్యులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి కోట శివశంకర్, చర్మ కార్మికుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంత్, భూపతి అశోక్, తదితరులు పాల్గొన్నారు.IMG-20240831-WA0847

Views: 408
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News