అక్రమ కట్టడాలను తొలగించాలని డిప్యూటీ తహసీల్దార్ కు వినతి
జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి బొగ్గుల నరసన్న , మేకల రాజు, యువరాజు
న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడుబూరు మండలం ఆగస్టు 19 :
మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బస్టాండ్ ఆవరణం నుండి పోలీస్ స్టేషన్ వరకు ఉన్న ఎమ్మిగనూరు ఆర్ బి రోడ్డులో ఇరువైపులా డ్రైనేజిపైన పలువురు వ్యక్తులు నివాసములు కట్టించుకున్నారని, అదే రోడ్డులో ప్రతి రోజు ప్రయాణిస్తున్న వాహనాలు ట్రాఫిక్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారని సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కు జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి బొగ్గుల నరసన్న , మేకల రాజు మరియు యువరాజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డుపైన ఇండ్లు నిర్మాణం చేయడం వలన ప్రతి రోజు పెద్దకడుబూరు నుంచి ఎమ్మిగనూరు కు వెళ్ళే రోడ్డులో వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని అత్యవసర పరిస్థితి నిమిత్తం ఆ రోడ్డులో వెళ్ళే ప్రయాణికులకు ట్రాఫిక్ తో చాలా సమయం అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజు ఎమ్మిగనూరు డిపో నుండి ఆర్టీసి బస్సు విద్యార్థుల కోసం మండలానికి ప్రయాణం చేస్తుందని, ట్రాఫిక్ లో విద్యార్థి బస్సు సమయానికి గమ్యం చేరడం ఆలస్యం అవుతుందాన్నారు. ఆ రోడ్డులో ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని, ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చెపడతామని డిప్యూటీ తహసీల్దార్ కు ఇచ్చిన వినతి పత్రంలో తెలియపరిచారు. పెద్దకడుబూరులోని ట్రాఫిక్ సమస్యపై న్యూస్ ఇండియా తెలుగు దినపత్రికలో ఆదివారం వార్త ప్రచురితం కావడం విశేషం.
Comment List