పాలకుర్తి నియోజకవర్గం లోని పలు సమస్యలను పరిష్కరించాలి
ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టు టీం సభ్యులు
పాలకుర్తి: ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత తీన్మార్ మల్లన్న మొట్టమొదటి సారిగా పాలకుర్తి కి రావడం వారిని సన్మానించి పాలకుర్తి నియోజకవర్గం లోని పలు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వినతి పత్రం అందజేయడం జరిగినది. పాలకుర్తి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని మరియు 100 పడకల ఆసుపత్రి వాటి గురించి శాసనమండలిలో ప్రస్తావించలని కోరడం జరిగినది. అంతేకాకుండా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు మండలాలలోని ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను ప్రభుత్వ దావాఖానాల సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ఏ విధంగా ఇబ్బంది కలవకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా కో కన్వీనర్ .కసోజు బ్రహ్మచారి, నియోజకవర్గ ఇన్చార్జి
గాడి పెళ్లి యాకన్న , రిపోర్టర్ వేర్పుల మహేష్ ,చెడు పాకసందీప్ కొమ్ము నరేష్,దుర్సోజు వీరాంజనేయులు తీన్మార్ మల్లన్న కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
Comment List