పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి లబ్బిదారులకు అందచేసారు.పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన 51 మంది బాధితులకు మంజురైన 11 లక్షల 81 వేల ఐదు వందల రూపాయలు (11,81,500) రూ. చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి లబ్బిదారులకు అందచేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతు ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్ని రెడ్డి అన్నారు.ప్రజా సంక్షేమం కోసం.. ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు.దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రములో ప్రజల కోసం పథకాలను రూపకల్పన చేసిన సిఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి అన్నారు.సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి కి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు హమ్యా నాయక్, రాపాక సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సోమా రాజశేఖర్, మండల అధ్యక్షులు సుంచు సంతోష్, రవీందర్ రెడ్డి, సురేష్ నాయక్, గిరగాని కుమారస్వామి, ముద్దసాని సురేష్, నల్ల శ్రీరామ్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు, పాల్గొన్నారు..

Views: 42
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి