రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలకు విలువనిచ్చి ప్రభుత్వం కావాలి
జాకట శ్రీనివాస్ ఆర్.ఎస్.పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.
జాకట శ్రీనివాస్
ఈరోజు ఉదయం మేడ్చల్ లోని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జాకట శ్రీనివాస్ పత్రికల విలేకరులతో మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, సామాన్య ప్రజల ప్రభుత్వం కావాలని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ తరఫున ఆశిస్తున్నాను. పేద ప్రజలు, సామాన్య ప్రజలు, రెక్క ఆడుతే గాని డొక్కాడని ప్రజలు వారి అవసరాలను అక్కర్లను ప్రతిపక్షాల ద్వారానే అధికార పక్షానికి తెలియజేస్తారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తే మన తెలంగాణ సమాజం బాగుపడుతుందని జాకట శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ ద్వారా మేము కూడా సామాన్య ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి మా దృష్టికి వచ్చిన ప్రతిసమస్యను తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటామన్నారు. మరిముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలు, మన సామాన్య ప్రజలకు అందేలా ఆర్.ఎస్.పి పార్టీ కార్యచరణ ఉంటుందని జాకట శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ లక్ష్యం సామాన్య ప్రజల సంక్షేమమని మరోసారి జాకట శ్రీనివాస్ గుర్తు చేశారు.
Comment List