డబుల్ ఇంజన్ సర్కారు తోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి లేగా రాం మోహన్ రెడ్డి

డబుల్ ఇంజన్ సర్కారు తోనే అభివృద్ధి సాధ్యం

డబుల్ ఇంజన్ సర్కారు తోనే అభివృద్ధి సాధ్యం.
బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి లేగా రాం మోహన్ రెడ్డిIMG-20231127-WA0031 గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం లో భాగంగా ఈరోజు తొర్రూరు పట్టణంలో 10,11,12,16 వార్డుల్లో బీజేపీ అభ్యర్థి లేగా రాం మోహన్ రెడ్డి విస్తృత ప్రచారం చేయడం జరిగింది.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమగ్రాభివ్రృద్ది కేవలం బీజేపీ తోనే సాధ్యం అని తెలిపారు.డబుల్ ఇంజన్ సర్కారు తోనే సుస్థిర పాలన అందుతుంది అని, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే, డబుల్ ఇంజన్ సర్కారు రావాలని తెలిపారు.పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతోంది అని, నిన్న తొర్రూరు పట్టణంలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో జరుగడం నిదర్శనం అని తెలిపారు.ఈనెల 28వ తేదీన తొర్రూరు పట్టణంలో బీజేపీ భారీ బహిరంగసభ ఏర్పాటు చేయడం జరిగిందని, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.పాలకుర్తి నియోజకవర్గ బీజేపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, జిల్లా అధికార ప్రతినిధి,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, ఎస్సీ మోర్చా మహాబాద్ పార్లమెంటు ఇంచార్జీ అలిసేరి రవిబాబు, 10,11,12,16, వార్డు నాయకులు పైండ్ల రాజేష్,కాగు నవీన్,జలగం రవి,నూకల నవీన్, జగదీష్,రాజ్ కుమార్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Views: 64
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అశోక వి గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...
రేషన్ బియ్యం దందా చేస్తే పి.డి యాక్ట్ కేసులు ఖాయం