జాబ్ మేళా ద్వారా వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత వేముల వీరేశం కి చెందుతుంది.మేకల విక్రం

On
జాబ్ మేళా ద్వారా వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత వేముల వీరేశం కి చెందుతుంది.మేకల విక్రం

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 18 (నల్గొండ జిల్లా ప్రతినిధి) కేతపల్లి మండల పరిధిలోని ఇప్పలగూడెం గ్రామంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల విక్రం మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మా గ్రామానికి చేసింది ఏమీ లేదు నాణ్యత లేని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అన్నారు. గతంలో ఉన్న పాత తాగునీరు ట్యాంక్ కి శిధిల వ్యవస్థల ఉన్నదానికి రంగులు అద్ది మిషన్ భగీరథ గా తీర్చిదిద్దారు.ఇంతవరకు ఏ ఇంటి కూడా మిషన్ భగీరథ నీళ్ళు అందలేదు దాని గురించి పట్టించుకునే నాధుడు లేడు అని చెప్పారు. మా గ్రామం నుండి పలు గ్రామాలకు లింకు రోడ్లు గురించి ఊసే లేదు.దీనితో ప్రజలు రాకపోకలకి అవస్థలు పడుతున్నారు.గతంలో ఉన్న వేముల వీరేశం ఉద్దీపన ధార ప్రజలకి ఇంగ్లీష్ మీడియం అందాలన్న సంకల్పంతో సొంత వాలంటరీ నిర్మించి నియోజకవర్గ పరిధి మొత్తం అన్ని ప్రభుత్వ స్కూల్లో ఎంతోమంది పేద పిల్లలకి బోధన చేపిస్తుండు. బస్సు సౌకర్యం లేకపోతే బస్సు సౌకర్యం పెట్టి విద్యను అందిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రిపేర్ అయ్యా వారికి ఉచిత కోచింగ్ ఇప్పించి ఎంతోమంది నిరుద్యోగులను తీర్చిదిద్దాడు అని అన్నారు. జాబ్ మేళా ద్వారా వేల మందిని కి ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత వేముల వీరేశం కి చెందుతుంది అని చెప్పారు. ఆయన చేసిన సేవే ఈసారి కచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నాం రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యమే వస్తుందని అన్నారు.

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News