సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావును మార్చకపోతే వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
పాయకరావుపేటలో గొల్లబాబూరావుకు దూరంగా వైసీపీ కేడర్
పెదపాటి అమ్మాజీకి అనుకూలంగా ఉన్న సర్వే రిపోర్టులు
అనకాపల్లి జిల్లాలో వైసీపీ రాజకీయం రోజుకో తీరుగా మలుపులు తిరుగుతోంది. పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబురావు వ్యవహారశైలి ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ , జనసేన పార్టీ కార్యక్రమాల్లో జోరు పెంచితే.. ఎమ్మెల్యే గొల్లబాబూరావు తీరుతో వైసీపీ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. గొల్లబాబూరావు తీరుతో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకునేలా ఉంది. ఇప్పటికే సీఎం జగన్ వరకు వెళ్లిన బాబూరావు పంచాయితీతో స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమల్ని టార్గెట్ చేస్తున్నారంటూ నాలుగు మండలాల వైసీపీ నేతలు ఎమ్మెల్యే వ్యవహారశైలి పై ఫిర్యాదులు చేశారు. ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ కు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. గతంలో తాము ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు తమల్ని టార్గెట్ చేస్తూ టీడీపీ శ్రేణులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని స్థానిక వైసీపీ ఆరోపిస్తున్నా,రు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి టికెట్ రాదని తెలుసుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నాయకులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అటు మూడు ,నాలుగు సర్వే రిపోర్టులను పరిశీలించిన హైకమాండ్ మనసులో ఎపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ ఉండటంతో.. త్వరలోనే ఆమెకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List