పరిసరాలను.. పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం
సర్పంచ్ సుగుణ గంగాధర్
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి లో ఆదివారం రోజు స్థానిక ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలో భాగంగా ఆదివారం రోజు ఉదయం గ్రామ సర్పంచ్ సుగుణ గంగాధర్ ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు మరియు ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు,చెత్తను తొలగించి ఒకగంట శ్రమాదానం చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత ఉంచుకోవాలని అన్నారు. ఆరోగ్యం సమస్య రాకుండ ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాలని సూచించారు. స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుభాష్, డాక్టర్ బి నాగమణి,ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రజలు పాలొగొన్నారు.
Views: 59
Tags:
Comment List