కాంగ్రెస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షులుగా తాండ్ర రవి నియమాకం
ఇబ్రహీంపట్నం ఎస్సి సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా కప్ప పహాడ్ గ్రామానికి చెందిన తాండ్ర రవి గారికి నియామక ఉత్తర్వులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతు....కాంగ్రెస్ పార్టీకి ఎస్సిలు పెట్టు కోట కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం.. నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం అన్నారు. పార్టీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తాను అన్నారు.ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్రెడ్డి రంగారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నాగరిగారి ప్రితం , జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు బర్రె రాజ్ కుమార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List