బేస్తవారిపేట లో ఘనంగా "నా దేశం-నా మట్టి" కార్యక్రమం
On
బేస్తవారిపేట న్యూస్ ఇండియా
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం లో భాగంగా "నా దేశం-నా మట్టి" అనే కార్యక్రమం సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. స్థానిక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి మట్టి, బియ్యం సేకరించారు.ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,ఎంపిటిసిలు లు, సి.బి.ఎం ఎం.ఆర్.సి వెంకట రెడ్డి, వాలెంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Views: 142
Tags:
Comment List