వినాయకుని మండపం వద్ద భారీ అన్నదానం
అన్నదాత ప్రభు గ్రామ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి
ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘం సభ్యులు
యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను కనుల పండుగగా జరుపుకుంటూ భారీ వినాయక విగ్రహాని ప్రతిష్టించి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను అందజేస్తున్నారు.రాత్రి వేళల్లో భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఆదివారం నందివనపర్తి ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి మహిళలు,యువకులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు.స్వామి వారికి భక్తి శ్రద్దలతో భజన కార్యక్రమాలు చేసారు.ఆ విగ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లో ఎదుర్కొంటున్న అన్ని విఘ్నాల నుండి విముక్తి కలిగించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు గోవర్ధన్ రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శంకర్ ,నాగరాజు ,దయాకర్, రవీందర్, శేఖర్, చంద్రకాంత్, లాజర్ఈశ్వర్ ముదిరాజు సంఘం పెద్దలు సభ్యులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List