డా|| వకుళాభరణంకు మహాత్మా జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కారం
డా|| వకుళాభరణంకు మహాత్మా జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కార జ్ఞాపికను అందజేసిన “తానా” తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా -TANA) జ్యోతిభాఫూలే విశిష్ఠ పురస్కారం, జ్ఞాపికను అందచేసింది. సామాజిక సేవా రంగంలో విశిష్ఠ సేవలు అందిస్తున్న వారికి ఈ పురస్కారం ఇవ్వాలని “తానా” నిర్ణయించి, తొలి అవార్డును డా|| వకుళాభరణంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఈ యేడాది జూలై 7,8,9 తేదీలలో) అమెరికా లోని ఫిలడెల్ఫియాలో జరిగిన 23వ తానా మహాసభలలో డాక్టర్ వకుళాభరణం విశిష్ఠ అతిథిగా పాల్గొన్నారు. కాగా, సాంకేతిక కారణాలతో అప్పుడు పురస్కారం, జ్ఞాపికను అందజేయలేకపోయారు. ఈ నేపథ్యంలో (అప్పటి) తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు సూచనలతో ఈ విశిష్ఠ పురస్కార జ్ఞాపికను తానా ప్రతినిధిగా, ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు డా|| ప్రసాద్ తోటకూర గురువారం నాడు నగరంలో డా|| వకుళాభరణం కు అందజేశారు. ఈ భేటీ, జ్ఞాపిక ప్రధానం ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలోని ఛైర్మన్ డా|| వకుళాభరణం ఛాoబర్స్ లో జరిగింది. ఈ సందర్భంగా డా|| ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ... వకుళాభరణం లాంటి గొప్ప సామాజికవేత్తకు ఈ పురస్కార జ్ఞాపికను మాతృ దేశానికి వచ్చి తన చేతుల మీదుగా అందచేయడం సంతోషంగా ఉందన్నారు. తానా మహా సభలలో బహుజన వర్గాల ప్రతినిధిగా కృష్ణ మోహన్ ప్రసంగం అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించిదని తెలిపారు. ఆయన లోని సామాజిక స్ఫూర్తి, అంకిత భావం, మూడున్నర దశాబ్దాలుగా ప్రధానంగా బీసీ వర్గాల నిమిత్తం చేస్తున్న కృషి అభినందనీయయమైనదన్నారు. డా|| వకుళాభరణం మాట్లాడుతూ... సామాజిక వేత్తలకు “తానా” తొలి సారిగా ప్రకటించిన ఫూలే పురస్కారంను తనకు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు తనలో మరింత బాధ్యతను పెంచిందన్నారు. పురస్కార జ్ఞాపికను స్వయంగా అందచేయడానికి డా|| ప్రసాద్ తోటకూరను తానా ఇక్కడికి (హైదరాబాద్) పంపించి అందచేయడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర అధ్యక్షులు, ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక పూర్వ అధ్యక్షులు – తానా మొబైల్ నెo.+1 (817) 300 - 4747
Comment List