సీబీఐకి కవిత కౌంటర్ రిప్లై
తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా […]
తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు.
తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.
కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నామని.. ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటుందో వివరించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కవిత ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. మరోవైపు విచారణ సమయంలో భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని, కేంద్రంతీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List