ఢిల్లీకి సీఎం కేసీఆర్

On

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్ట్ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఆ వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బంజారాహిల్స్‌లోని చీఫ్ జస్టిస్ నివాసంలో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే, చీఫ్ జస్టిస్‌తో ఏ అంశంపై సీఎం చర్చించారు. ఢిల్లీకి సడెన్‌గా ఎందుకు వెళ్లారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణ ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. […]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్ట్ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఆ వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బంజారాహిల్స్‌లోని చీఫ్ జస్టిస్ నివాసంలో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే, చీఫ్ జస్టిస్‌తో ఏ అంశంపై సీఎం చర్చించారు. ఢిల్లీకి సడెన్‌గా ఎందుకు వెళ్లారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు తెలంగాణ ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితమివ్వనున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ లెఫ్ట్‌ పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది.

మరో వైపు ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో అనేక చోట్ల మోదీకి నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మరో వైపు మోదీ పర్యటనను అడ్డుకుంటామని, ఆందోళన చేపడతామంటూ వాపమక్షాలు, విద్యార్థి JAC నేతలు హెచ్చరించారు. అలాగే రామగుండం బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఇక ఇటు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కేంద్రం ప్రోటోకాల్‌ పాటించకుండా తెలంగాణ సీఎంను అవమానిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ కూడా కేంద్రం ఇలాగే వ్యవహరించిందని విమర్శించింది. ఇంతగా అవమానిస్తుంటే సీఎం ఎలా వస్తారని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.

ప్రధాని పర్యటనను వ్యతిరేకించడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీజేపీ నేతలు విమర్శించారు. ఏదేమైనా మునుగోడు ఎన్నికల తర్వాత మోదీ పర్యటన పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News