అభినందన సంచిక గురు సత్కారం
*రామచంద్రామృతం* అనే పేరుతో సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం
సత్కారం అందుకున్న భుజేoధర్
ఆదివారం రోజున యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ వేడుకల మందిరంలో కవి సౌజన్య,వ్యాసాల వ్యాసుడు, మహా ఉపాధ్యాయుడు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర 80 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా *రామచంద్రామృతం* అనే పేరుతో సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బమ్మెర గ్రామవాసి శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేoదర్ ను గురువర్యులు, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర దంపతులు, మరియు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి శాలువాతో సన్మానించి రామచంద్ర అమృతం పుస్తకం, జ్ఞాపికతో సత్కరించారు. గురు సత్కారం అందుకున్నందుకు బుజేందర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పోరెడ్డి రంగయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. సభా అధ్యక్షత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి వహించారు. ముఖ్య అతిథులుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కుడుదుల నాగేష్, మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఆచార్య బన్న ఐలయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి నామోజు బాలా చారి, జనగామ, యాదాద్రి కవులు, రామచంద్ర సార్ శిష్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List