"గణతంత్ర దినోత్సవం" అనగా నాడు మన హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల పోరాటం ఫలం...

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

On

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం జనవరి 26 :- భారతదేశం ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దకడుబూరు మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా ఎంపీపీ బాపురం శ్రీవిద్య మరియు వైసీపీ మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి దంపతులు మరియు మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు. పాఠశాలలో ఘనంగా 76వ "గణతంత్ర దినోత్సవం" వేడుకలను జరుపుకున్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మువ్వెన్నెల జాతీయ జండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్య అతిధులు మాట్లాడుతూ "గణతంత్ర దినోత్సవం" అనగా ప్రతి భారతీయుడి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఎందుకంటే ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. స్వేచ్ఛా, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచిన రోజు అని వివరించారు. మన స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలను గుర్తు చేసుకునే రోజు "గణతంత్ర దినోత్సవం" రోజు అని అన్నారు. స్వేచ్ఛా భారతావని నిర్మాణానికి సహకరించిన మహోన్నత వీరులకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలని, మనమందరం స్వాతంత్ర అమరవీరులను స్ఫూర్తి చేసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని కార్యక్రమంలొ ఉన్న పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థులందరూ చదువులో మంచి పట్టు కలిగి భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకోవాలని , ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని విద్యా బుద్ధులు నేర్పించారు. అలాగే విద్యార్థులకు స్వీట్లు మరియు నోట్ బుక్స్ లు పంచారు. అలాగే పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం పాఠశాలలో కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎంపిడిఓ, సర్పంచ్ రామాంజినేయులు, ఎంపిటీసీ ముక్కరన్న, అర్లప్ప, అనిల్, సుధాకర్, లోకేష్ , పాఠశాల విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు...IMG_20250127_105803

Views: 66
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..! మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...