లక్ష్మీదేవిపల్లి మండలంలో జోరుగా ఇసుక దందా 

పగలు రాత్రి తేడా లేకుండా తొలకాలు

On
లక్ష్మీదేవిపల్లి మండలంలో జోరుగా ఇసుక దందా 

మాజీ ప్రజా ప్రతినిధి అండదండలతో దందా..

లక్ష్మీదేవిపల్లి (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 26: భూగర్భ జలాలు అడుగంటుతున్న, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న, పట్టించుకునే అధికారులు లేకుండా పోయారు.లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం వాగు నుంచి జోరుగా ఇసుక దందా నడుస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక తోలకాలు జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టింపు లేకుండా పోయింది. ఇంత బహిరంగంగా అంతా మా ఇష్టం అంటూ ఈ ఇసుక దందా జరుగుతుందంటే స్థానిక మాజీ ప్రజాప్రతినిది అండ దండలు పుష్కలంగా ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు రాత్రి స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఇసుక తోలకాలు జరుపుతున్నారు. ఈ ఇసుక ట్రాక్టర్లు డ్రైవర్లు కుడా అతివేగంగా ట్రాక్టర్లు నడపడంతో స్థానికులు ఒకింత భయాందోళనకు  గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Views: 58
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..! మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...