జిల్లా వైద్యాధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలి....

ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర..

On
జిల్లా వైద్యాధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలి....

సరూర్ నగర్,డాక్టర్స్ కాలనీలో ఉన్న  అలకానంద మల్టీస్పెషల్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు  దిగిన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) సభ్యులు. ..

జిల్లా వైద్యాధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలి....

ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర..

ఎల్బీనగర్, జనవరి 22 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- రంగారెడ్డి జిల్లా వైద్య అధికారి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు. సరూర్ నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో అలకానంద హాస్పిటల్లో అక్రమంగా కిడ్నీల  మార్పిడి జరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం అలకనంద హాస్పిటల్ ని సీజ్ చేశారు. బుధవారం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వైద్య అధికారి అనుమతులు లేని హాస్పిటల్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రైవేట్ హాస్పిటల్లో పై ప్రత్యేక టీమును పెట్టి విస్తృత తనిఖీలు చేయాలని కోరారు. 9 పడకల ఆసుపత్రికి అనుమతి తీసుకుని 32 పడకల ఆసుపత్రిగా ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు?

సరూర్ నగర్,డాక్టర్స్ కాలనీలో ఉన్న  అలకానంద మల్టీస్పెషల్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు  దిగిన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) సభ్యులు. 

Read More ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి..

వైద్యాధికారుల నిర్లక్ష్యం తోని ఇలాంటి హాస్పిటల్ పుట్టుకొస్తున్నాయని  కమిషన్ల మత్తులో అధికారులు మునిగి తేలుతున్నారని రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయని  పట్టించుకోవలసిన అధికారులే  నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరిస్తున్నారని ధర్మేంద్ర మండిపడ్డారు. అనుమతులేని హాస్పిటల్ వ్యవహారం లో వైద్యాధికారులపై కూడా విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలకానంద హాస్పటల్ నిర్వాహకుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అనేక సంఘటనలను చోటుచేసుకున్న వైద్యాధికారులు తూతూ మంత్రంగా వివరిస్తున్నారని హైదరాబాదులో దాదాపు 90 శాతం హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్నాయని ధర్మేంద్ర తెలిపారు.

Read More ఘనంగా వివాహ పరిచయ వేదిక

*

Read More ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

Screenshot_2025-01-22-12-02-43-17_7352322957d4404136654ef4adb64504
అలకనంద మల్టీస్పెషల్టి హాస్పిటల్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు

అలకనంద హాస్పిటల్ ని పరిశీలించిన కమిటీ సభ్యులు..*

సరూర్నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో కిడ్నీలను అక్రమంగా అమ్ముకుంటున్న అలకనంద హాస్పిటల్ ని సీజ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్, మహేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నాలుగురు సభ్యులతో కలిపి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అలకానంద హాస్పిటల్ ని పరిశీలించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని తెలిపారు.

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News