ఇబ్రహీంపట్నంను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా...!!

తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట  మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే...

On
ఇబ్రహీంపట్నంను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా...!!

సుమారు రూ.80 కోట్లతో ప్రజా మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం...

ఇబ్రహీంపట్నంను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా...!!

తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట  మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే...

సుమారు రూ.80 కోట్లతో ప్రజా మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం...

ఇబ్రహీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

Read More సంక్రాంతి శుభాకాంక్షలు..

ఎల్బీనగర్, జనవరి 20 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ప్రపంచ పటంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన నగరంగా కీర్తిని గడించిన హైదరాబాద్ మహానగరంలోని అన్ని నియోజకవర్గాల కంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్ది, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కచ్చితంగా నెరవేరుస్తానని, అదేవిధంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గుట్టపై చరిత్రలో నిలిచిపోయే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం, తొర్రూరు గ్రామంలోని గుట్టపైన వెలిసినటువంటి శ్రీ గోదారంగనాథ స్వామి దేవాలయ అభివృద్ధికి శక్తి వంచనలేని కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్టు మండలం తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీల్లో తదితర వార్డుల్లో సుమారు రూ.80 కోట్ల నిధులతో మున్సిపాలిటీల్లో  సుమారు 65 అభివృద్ధి పనులకు టీజీ ఆర్డీసీ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రామ్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, కౌన్సిలర్లు తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా, వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, కోశిక ఐలయ్య, కాకుమాను సునీల్, మర్రి మాధవి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్. భాస్కరా చారి, ఏఎంసి డైరెక్టర్ దోమలపల్లి అంజయ్య, తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితోపాటు ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో కార్యక్రమం చివరి వరకు జన సముద్రాన్ని తలపించింది. ప్రతి వార్డుల్లో కాలనీ సంక్షేమ సంఘాలు, గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. జన సమూహాన్ని తిలకించిన ఎమ్మెల్యే ఒక్కింత ఆనందాన్ని వ్యక్తం చేశారు. తానెప్పుడూ ప్రజల మనిషి నేనని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కనివిని ఎరగని రీతిలో నూటికి నూరు శాతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పేర్కొనడంతో ఈ సందర్భంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...... ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను పూర్తి చేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేంతవరకు నిద్రపోనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా విరాజిల్లుతూ ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మున్ముందు రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా నియోజకవర్గం అభివృద్ధికి వందల కోట్ల రూపాయలను, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని శశశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు,

Read More ప్లాస్టిక్ నివారిద్దాం

IMG20250120113638_01
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి, టిజి ఆర్డిసి చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రామ్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, కౌన్సిలర్లు...

వివిధ విభాగాల ప్రభుత్వ అధికారుల బృందం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More ఘనంగా వివాహ పరిచయ వేదిక

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News