నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 

APGVB బ్యాంకు TGB బ్యాంకు లో విలీనం 

On
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 

వివరాలు వెల్లడించిన రీజినల్ మేనేజర్ ఉదయ్

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)డిసెంబర్ 20: APGVB సేవలు ఈనెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు బ్యాంకు లావాదేవీలు రద్దు చేస్తున్నట్లుగా రీజనల్ మేనేజర్ ముక్తాపురం ఉదయ్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఏపీజీవీబీ  బ్యాంకును తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణలోని 493 ఏపీజీవిబి శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB) లో విలీనం  చేస్తున్నట్టుగా తెలిపారు. కావున యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొదలగు సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. ఏపీజీవిబీ ఖాతాదారులు ఎవరైనా ఈనెల 27 తేదీ వరకు సేవలు ఉపయోగించుకోవచ్చు అన్నారు. 1-1- 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో తిరిగి సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ సుధీర్ పాల్గొన్నారు.

Views: 126
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!