టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభలు
జయప్రదం చేయండి
రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పిలుపు
ఈనెల 13 14 15 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించే టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి- రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పిలుపు
మంగళవారం రోజున బోడుప్పల్ పరిధిలోని మాణిక్చంద్ కంపెనీ దగ్గర ఈనెల 13 14 15 జరిగే టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభలు జయప్రదం చెయ్యాలని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి టి యు సి ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే సంఘం టి యు సి ఐ అన్నారు. ఈ జాతీయ మహాసభలకు అన్ని రాష్ట్రాల నుండి డెలిగేట్స్ వస్తారన్నారు. గత పోరాటాలను రివ్యూ చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ఈ జాతీయ మహాసభలకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి మిట్ట అంజన్న టి యు సి ఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఖాసీం మంజుల రాయుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List