అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి...
ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మేట్, డిసెంబర్ 06 న్యూస్ ఇండియా ప్రతినిధి...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూర్, తొర్రూరు లో డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మేల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, ఆర్ధిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా భారత దేశానికి ఎన్నో సేవలను అందించారని ప్రజలకు మత స్వేచ్చా, అంటరాని తనం నిర్మూలన తోపాటు వ్యక్తిగత స్వేచ్చా పౌర స్వేచ్ఛ, మహిళలకు విస్తృతమైన ఆర్ధిక, సామాజిక హక్కుల కోసం వాదించిన వారిలో అంబేద్కర్ అందరికి స్ఫూర్తి అని అన్నారు. అంబేద్కర్ భావితరాలకు కూడా ఒక గొప్ప స్ఫూర్తి దాయకుడని అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరు ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, తుర్కయాంజల్ మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత దన్ రాజ్ గౌడ్, పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివ కుమార్ కౌన్సిలర్లు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, నక్క శివలింగం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List