హోరా హోరిగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

రెండో రోజు లీగ్స్ దశలో కొనసాగుతున్న పోటీలు

On
హోరా హోరిగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

ఆసక్తిగా తిలకించిన క్రీడా అభిమానులు

కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో నరేష్) అక్టోబర్ 29: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని  ఏర్పాటు చేసిన  పిఎస్ఆర్ ట్రస్ట్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు రెండోరోజు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో  హోరాహోరీగా మంగళవారం కొనసాగాయి. లీగ్ దశలో పాల్గొన్న ప్రతి జట్టు నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ, విజయం దిశగా ముందుకు సాగాయి. ప్రముఖ క్రీడాకారుల జట్లు క్రీడా అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆట ప్రారంభం దశలో నాలుగు జట్లు తలపడ్డాయి.రెండో రోజు మొదటి దశ కబడ్డీ పోటీలు పురుషుల లీగ్ విభాగంలో మెదక్ వర్సెస్ హైదరాబాద్ జట్లు  తలపడగా, మెదక్ 37 పాయింట్లు , హైదరాబాద్ జట్టు 24 సాధించగా,మెదక్ 13 పాయింట్ల తేడాతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది . మరొక పురుషుల పోటీలో రంగారెడ్డి వర్సెస్ వరంగల్ పోటీ పడగ రంగారెడ్డి 45 పాయింట్లు, వరంగల్ 21 పాయింట్లు సాధించగా 24 పాయింట్ల తేడాతో వరంగల్ పై రంగారెడ్డి విజయం సాధించింది. మహిళా విభాగంలో రంగారెడ్డి వర్సెస్ మెదక్ జట్లు తలపడగా రంగారెడ్డి 45, మెదక్ 8 పాయింట్లు  సాధించగా 37 పాయింట్లు తేడాతో మెదక్ జట్టుపై రంగారెడ్డి విజయం సాధించారు. మరొక పోటీలో హైదరాబాద్ వర్సెస్ నల్గొండ జట్లు తలపడగా హైదరాబాద్ 32 , నల్గొండ 59 పాయింట్లు సాధించారు . 27 పాయింట్లు తేడాతో హైదరాబాద్ జట్టుపై నల్గొండ గెలుపొందింది. ఈ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులను మరియు క్రీడా అభిమానులను ఆకర్షించే విధంగా గ్రూప్ డాన్స్ ప్రోగ్రాంలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను తిలకించడానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పిసిసి సభ్యులు నాగ సీతారాములు, ఊకంటి గోపాలరావు, రజాక్, కబడ్డీ పోటీలను తిలకించారు.

Views: 230
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News