పులిగిల్ల నుండి ఉప్పల్ వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం
నూతనంగా బస్సు సర్వీసును ఉప్పల్ నుండి పులిగిల్ల వరకు శుక్రవారం రోజున పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించబడిన ఈ బస్సు సర్వీసు కోసం గ్రామ నాయకులు నక్కల మాధవరెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి పులిగిల్లకు బస్సు సర్వీసును పంపించాల్సిందిగా ఫోన్ ద్వారా కోరగా వారు డిపో మేనేజర్ తో మాట్లాడడంతో వెంటనే వారు స్పందించి బస్సు సర్వీసును పునరుద్ధరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ గ్రామం నుండి హైదరాబాదుకు వెళ్లడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఎమ్మెల్యే ఎంపీ చేసిన కృషికి గ్రామ ప్రజలందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పులిగిల్ల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, మాజీ ఎంపిటిసి బండారు ఎల్లయ్య, పాశం స్వామి, వాకిటి సంజీవరెడ్డి, పైళ్ళ రవీందర్ రెడ్డి బుగ్గ బీరప్ప, పల్సం భాస్కర్, జక్క దామోదర్ రెడ్డి, బుగ్గ మనోజ్, బండారు మైసయ్య, వాకిటి వెంకట్ రెడ్డి, పర్వతం రాజు, పల్లెర్ల యాదగిరి, మారబోయిన రాజు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List