ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాలతో తారాపురం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన వైసీపీ నేతలు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 28 :- వైస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మండల పరిధిలోని తారాపురం గ్రామంలో వెలసిన శ్రీ గిడ్డాఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తిరుమలలో ఎంతో పవిత్రత కలిగిన ప్రసాదాన్ని కొందరు అపవిత్రత పాలు చేసారని హిందూ ఆలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా వైస్సార్సీపీ రాష్ట్ర కమిటీ ఆదేశించడం జరిగిందని పెద్దకడుబూరు మండలంలోని వైసీపీ నేతలు పేర్కొన్నారు. శనివారం ఉదయము 10గంటలకు తారాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో వైసీపీ మండల నేతలు జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రా రెడ్డి, విజేంద్ర రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శివరామి రెడ్డి మరియు మాజీ ఎంపీపీ రఘురాముడు లు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలకు నిరసనగా ప్రత్యేక పూజలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, జాము మూకయ్య, సుందరం, ప్రసాద్, ఏసన్న, లోకేష్, ఆంజనయ్య మరియు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comment List