మానవత్వంతో మండల వైసీపీ నేతలు ముందడుగు...!

- బాధిత కుటుంబానికి 50వేలు ఆర్థిక సహాయంతో చేయూత.

On
మానవత్వంతో మండల వైసీపీ నేతలు ముందడుగు...!

- బాధిత కుటుంబానికి వైసీపీ నేతలు నిత్యవసర సరుకులు పంపిణి.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 26 :- మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం సాయంత్రం వేళలో స్థానిక ఎస్సి కాలనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంచోది శాంతిరాజు యొక్క ఇంటిలో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సుమారు 5లక్షల వరకు ఆస్థి నష్టం జరిగింది. గురువారం ఈ విషయం తెలిసుకున్న వెంటనే వైసీపీ యువనేత వై. ప్రదీప్ రెడ్డి 25వేలు మరియు పెద్దకడుబూరు వైసీపీ పార్టీ నేతలు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.రామలింగారెడ్డి, ఆర్.రవిచంద్రా రెడ్డి, ఆర్. శివరామి రెడ్డి, సర్పంచ్ రామాంజినేయులు మరియు వార్డు మెంబెర్ బ్రమ్మయ్య ఆచారి అందరూ 25వేలు కలిపి మొత్తం 50,000/-రూపాయలను అగ్నిప్రమాదం జరిగిన మంచోది శాంతిరాజు అనే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులెవ్వరు అధర్యపడొద్దు అండగా అండగా ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ప్రదీప్ రెడ్డితో పాటు మేమంతా ఉన్నాం అని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందేలా చూడాలని అధికారులను కోరారు. అనంతరం ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు...ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, సుందరం, ప్రసాద్, రాజు మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20240926-WA0214

Views: 53
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్