ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు..!

On
ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు..!

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన హెడ్ మాస్టర్ వక్రమార్గంలో నడుస్తున్నాడు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థుల పాలిట కీచకుడిలా మారి నీచంగా ప్రవర్తిస్తున్న హెడ్ మాస్టర్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఆది ఆంధ్ర) నందు హెడ్ మాస్టర్ గా కె.సుప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల హెడ్ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అసభ్యకర వీడియోలను చూపిస్తున్నాడని, చాలా కాలంగా పాఠశాలలో చదుతున్న విద్యార్థులపై ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండలంలోని ఎంఈఓ ఎస్.సువర్ణలా సునియమ్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఎంఈఓ సదరు హెడ్ మాస్టర్ విషయమును గురించి విచారించుకుని పెద్దకడుబూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఎంఈఓ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ లో హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడమైనదని ఎస్ఐ నిరంజన్ రెడ్డి విలేకరులకు తెలిపారు.pocso-2

Views: 60
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అశోక వి గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...
రేషన్ బియ్యం దందా చేస్తే పి.డి యాక్ట్ కేసులు ఖాయం