ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చు...

రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ సంచాలకులు జి.యం. వేదామని రైతులకు పలు సూచనలు వెల్లడి.

On
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చు...

కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యం. వరప్రసాద్.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 21 :- పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి యం. వరప్రసాద్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కంబదహల్ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శనివారం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖరీఫ్ పంటలలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కే. రాఘవేంద్ర చౌదరి, కర్నూల్ రైతు శిక్షణా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు వేదమని పాల్గొని కంబదహాల్ గ్రామ రైతులకు మిరప, పత్తి, వేరుశెనగ మరియు వివిధ పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతన్నలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మిరపలో తామర పురుగు వలన ఆకులు పైకి ముడుచుకొనిపోయి పైరు ఎదుగుదల లోపించి దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. కాబట్టి తామర పురుగు నివారణకు 10 నీలం రంగు జిగురట్టలను పెట్టుకోవాలని, పిప్రో నిల్ ౨ మిల్లీలీటర్లు 1 లీటర్ కి లేదా పీప్రో నిల్ + ఇమిడా క్లోరోపిడ్ 0.2 గ్రామ్ 1 లీటర్ కి లేదా స్పైనోటారం 0.9 మిల్లీలీటర్లు 1 లీటర్ కి కలిపి మార్చి మార్చి పిచికారి చేయాలన్నారు. వాటితోపాటు వేప నూనె 10వేల పిపిఎం 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ కి కలుపుకొని పిచికారి చేసుకోవడం వలన పురుగు గుడ్డు దశను నివారించవచ్చును అని రైతులకు సూచించారు. నులిపురుగు నివారణకు నింబిసీడిన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ కు లేదా పూయోపైరం 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ కి కలుపుకొని వార్లు తడిచే విధంగా పిచికారి చేయాలని అన్నారు. *ప్రత్తి పంటలో-* తెల్ల దోమ పచ్చ దోమ నివారణకు ఫ్లూనికామైడ్ 0.3 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. అలాగే ఎకరాకు 30 కిలోల యూరియా 20 కిలోల పొటాష్ వరుసల మధ్యలో చల్లుకోవటం వలన మొక్క ఎదుగుదలకు కాయ పగలడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. రోగ నిర్ధారణ సందర్శనలో భాగంగా *మిరప పంటలో* ఎండు తెగులు గమనించి కాపురాక్సీ క్లోరైడ్ 3 గ్రామ లీటర్ నీటికి లేదా ట్రైకోడెర్మా 5 గ్రామ్ లీటర్ నీటికి కలుపుకొని మొదలు తడిచే విధంగా పిచికారి చేసుకోవలెను అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకుడు రఘువీర్, గ్రామ సర్పంచ్ దస్తగిరి, గ్రామ రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు...IMG-20240921-WA0159

Views: 86
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News