భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్పీ రోహిత్ రాజు

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ) సెప్టెంబర్ 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  భారీ వర్షాల కారణంగా ప్రజలు  ప్రమాదాల బారిన పడకుండా పలు సూచనలు బుధవారం  ఒక ప్రకటనలో తెలిపారు.సెల్ఫీ  ఫొటోస్ కోసం   వాగులు,వంకలు,నదులు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దు,వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దు.వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయి.వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది.కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలి.భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతున్నది కావున పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగం  సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలి.ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలి.జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది.ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలును ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని వెల్లడించారు.

Views: 29
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News