నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రక్తదానం మరియు లైంగిక వ్యాధులపై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం
ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల, అకౌంటెంట్ మరియు ప్రోగ్రామ్ అధికారి భానుచందర్ సహకారంతో రక్తదానం మరియు లైంగిక వ్యాధులపై, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు ఖమ్మంలో కొన్ని డివిజన్స్ 50 ఇల్లు డోర్ టు డోర్ తిరిగి అవగాహన ఇవ్వడం జరిగింది. "హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పెంపొదిద్దాం హెచ్ఐవి రహిత సమాజాన్ని సాధిద్దాం" అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. తగు జాగ్రత్తలు పాటించకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికైనా సోకవచ్చు మనలో చాలామందికి తన హెచ్ఐవి స్థితి తెలియదు. హెచ్ఐవి నాలుగు విధాలుగా మాత్రమే సోకుతుంది. అసురక్షిత లైంగిక సంబంధాల ద్వారా, కలుషితమైన సూదులు - సిరంజీల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొక్కరికి ఎక్కించడం ద్వారా, హెచ్ఐవి సోకిన తల్లి నుండి పొట్టబోయే బిడ్డకు. పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు డోర్ టు డోర్ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ కు, యూత్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు.
Comment List