కరీంనగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మానసా రెడ్డి..!

రూ.25,000 నాణేలతో సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లింపు..

On
కరీంనగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మానసా రెడ్డి..!

న్యూస్ ఇండియా ప్రతినిధి, కోక్కుల వంశీ..

కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా  సైదపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన పేరాల మనసా రెడ్డి మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ లో తన నామినేషన్ పత్రాలు దాఖలాలు చేశారు.  ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

IMG-20240423-WA0062  అనంతరం పేరాల మనసా రెడ్డి  మాట్లాడుతూ... హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాడు  శ్రీరాముని కి హనుమంతుడు ఎలా ఐతే తోడుగా ఉండి ధర్మయుద్ధాన్ని గెలిపించాడో అలాగే నాకు కూడా హనుమంతుడు తోడుగా ఉండి తన ధర్మయుద్ధాన్ని గెలిపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ రాముని ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీస్సులతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువకులు, రైతన్నలు, నిరుపేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు, సన్నిహితులు నుంచి ఒక్కొరూపాయిని ఎంపీ నామినేషన్ రుసుముగా ₹25,000/- రూపాయలను నాణేల రూపంలో అధికారులకు చెల్లించారు. తనకు అండగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20240423-WA0061

పేరాల మనసా రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సివిల్ ఇంజనీర్ గా సుపరిచితురాలు, మహిళలు, విద్యావంతులు,యువకులు రాజకీయాల్లోకి వస్తే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని నమ్మి ప్రజల సమస్యలను చట్టసభల్లో వినిపిస్తే త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తానూ రాజకీయాల్లోకి వచ్చానని పార్లమెంట్ సభ్యురాలిగా తనను గెలిపిస్తే ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి శాయశక్తులా కృషిచేస్తానని పేరాల మనసా రెడ్డి అన్నారు.

Read More బర్త్ డే ట్రీ తెలంగాణ

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News