నా కూతుర్ని మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా ఆశీర్వదించండి

తొర్రూరు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నా కూతుర్ని మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా ఆశీర్వదించండి

*కడియం శ్రీహరి మాట్లాడుతూ*
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది,అభివృద్ధి చేయడానికి ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నమని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విన్నవించారు. గత ఐదేళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిప-క్ష పాత్రకే పరిమితమయ్యామన్నారు. బీఆర్ఎస్ ను వీడి నేను నా కుతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరాము.కొంత మంది బిఅర్ఎస్ నాయకులకు వచ్చిన అవకాశాలను చెడగొట్టుకొని ఎదుటి వాళ్లపై విమర్శలు చేస్తున్నారనడం గమనార్హం. బిఆర్ఎస్ ప్రస్థానంలో ఒక్క తప్పు కూడా చేయలేదని, అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు చేయలేదు, ప్రయివేట్ యూనివర్సీటిలు పెట్టుకోలేదంటూ..నన్ను విమర్శించే నైతిక అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు.ప్రతీ ఒక్కరూ శ్రీహరి ఏ నిర్ణయం తీసుకున్నా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నినదించారు. నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీలేదని ఆ హక్కు ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఉందన్నారు..ఎవరికి కూడా నన్ను విమర్శించే స్థాయి గాని, అర్హత గాని లేదన్నారు. నన్ను ఆశీర్వదించినట్లే నా కూతురును కూడా ఆశీర్వదించాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోరారు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా... బిడ్డగా, అక్కగా, చెల్లీగా నిండు మనసుతో ఆశీర్వదించాలని యశస్విని ఝాన్సి రెడ్డిలను కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు అనుమాండ్ల తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కాకినాడ హరిప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ పట్టణ పార్టీ అధ్యక్షులు సోమరాజు శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదగాని సోమయ్య చాపల బాపురెడ్డి జలగం శ్రీనివాస్ గొంగడి శంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్య నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1712570039446

Views: 113
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి