కారు నుండి.. కమలంలోకి..! ౼ బీజేపీ లో చేరిన మెండోరా ఎంపీటీసీ సభ్యులు ఆరే లావణ్య-రవీందర్..

- కాషాయ కండువా కప్పి ఎంపీటీసీని పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అరవింద్.

On
కారు నుండి.. కమలంలోకి..!    ౼ బీజేపీ లో చేరిన మెండోరా ఎంపీటీసీ సభ్యులు ఆరే లావణ్య-రవీందర్..

నిజామాబాద్, ఫిబ్రవరి27, న్యూస్ ఇండియా ప్రతినిధి  - కోక్కుల వంశీ

IMG-20240227-WA0093

పార్లమెంట్ ఎన్నికల వేళ భింగల్ మండలంలో బీజేపీలో చేరికల జోష్ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన  యంపీటీసీ ఆరే లావణ్య రవీందర్ తో పాటు బీఆర్ యస్ పార్టీ నాయకులు ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పరు.. ఇది ఇలా ఉండగా మంగళవారం భింగల్ పట్టణంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే దనపాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బాల్కొండ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో మెండోరా ఎంపిటిసి ఆరే లావణ్య రవీందర్ కు కమలం కండువా కప్పి  పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు.  IMG-20240227-WA0095

ఆరే లావణ్య రవీందర్ తో పాటు, పలువురు బీఆర్ యస్ పార్టీ నాయకులు సైతం బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మడం లేదన్నారు. తప్పుడు హామీలతో  కాంగ్రెస్, బీఆర్ యస్ పార్టీ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. FB_IMG_1709051342291

Read More ఉన్నతి కోసం యువత శ్రమించాలి...

కాంగ్రెస్ మేనిఫెస్టో సైతం మోసపూరితమైనదేనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. బీజేపీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతోందని.. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన వారే కాకుండా మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో బిజెపి పార్టీలో చేరుతున్నారని అన్నారు.  IMG-20240227-WA0093FB_IMG_1709051340053

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

పార్టీలో చేరిన ఎంపిటిసి ఆరే లావణ్య రవీందర్ మాట్లాడుతూ... బీజేపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తనవంతుగా పనిచేస్తానన్నారు.  ధర్మరక్షణ కోసం బీజేపీలో చేరామన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్, నియోజకవర్గ ఇంఛార్జ్ యేలేటి మల్లికార్జున్ రెడ్డి నిర్ణయం మేరకు పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని  నరేంద్రమోదీని మూడవ సారి ప్రధానమంత్రిగా చేసుకుంటామని అన్నారు. FB_IMG_1709051331632

Read More అనాధలకు అండగా

 

Views: 87
Tags:

About The Author

Post Comment

Comment List