ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
On
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి.* కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయిన తన తండ్రి సాయన్న మృతి నుండి ఇంకా కోలుకొక ముందే, ప్రజా సేవలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
Views: 42
Tags:
Comment List