బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ యస్ కు షాక్..!
పార్టీకి రాజీనామా చేసిన భింగల్ పట్టణ అధ్యక్షుడు
నిజామాబాద్,ఫిబ్రవరి06, న్యూస్ ఇండియా ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భింగల్ పట్టణంలో బీఆర్ యస్ పార్టీకి షాక్ తగిలింది. గత రెండు వారాలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరు పార్టీని విడుతున్నారు.
గత వారం క్రితం భింగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన ఎంపీటీసీ రాజీనామా మరవకముందే మంగళవారం భింగల్ బీఆర్ యస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లేలా లక్ష్మణ్ రాజీనామా చేశారు. త్వరలో తను బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలోకి వేలనునట్లు తెలిసింది. మల్లేలా లక్ష్మణ్ తన ఫేసుబుక్ లో పోస్ట్ లు రాస్తూ.. బీఆర్ ఎస్ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని. అందుకే పార్టీకీ రాజీనామా చేస్తున్నామని మల్లేలా లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఓడిపోయే పరిస్థితిలో ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ని గెలిపించిన ఘనత భింగల్ మండల ప్రజాలదని కనీసం ప్రశాంత్ రెడ్డి గెలుపుకోసం కష్టపడిన పార్టీ నేతలను, కార్యకర్తలను కనీసం గుర్తించకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వరలో మరి కొందరు రాజీనామా బాటలో ఉన్నారని త్వరలో వారు కూడా రాజీనామాలు చేస్తారని అన్నారు.
Comment List