ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన మేకల కాపరి

రుద్రంగి, జనవరి30,న్యూస్ ఇండియా ప్రతినిధి

On
ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన మేకల కాపరి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండరెంజల్ గ్రామానికి  చెందిన బాగయ్య (24) అనే మేకల కాపరి ప్రమాదవశత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గైదిగుట్ట అడ్డబోర్ తాండల సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిసిన వివరాల ప్రకారం..IMG_20240130_222446

రుద్రంగి మండలం గైదిగుట్ట అడ్డబోర్ తండా సమీపంలో మంగళవారం ఉదయం బాగయ్య మేకలను తీసుకొని మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చెయ్యడానికి తాగడానికి నీళ్లు లేకపోవడంతో  తన మిత్రుడి కి నీళ్లు తీసుకువస్తా అని బాగయ్య సమీప దగ్గరలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. నీళ్లకోసం వెళ్లిన బాగయ్య ప్రమాదవశాత్తు బావిలో పడిపోగా బాగయ్య రాకపోయే సరికి బావి దగ్గరకి తన మిత్రుడు బావి దగ్గరికి వెళ్లే సరికి బావి వద్ద చెప్పులు, గొంగడి ఉన్నట్టు గుర్తించాడు. ఈ విషయం వెంటనే దగ్గరలో ఉన్న స్థానికులకు చేరవేయగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి బంధువులకు సమాచారం అందించి పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్లకు తరలించినట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

Views: 336
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్