SSC 54 రోజుల యాక్షన్ ప్లాన్ ను స్వాగతీస్తున్నం
SC ST ఉపాధ్యాయ సంఘం
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశాల ప్రకారం సంగారెడ్డి జిల్లా విద్యాధికారి S. వెంకటేశ్వర్లు ముందు చూపుతో ఈ విద్యా సంవత్సరoలో సంగారెడ్డి జిల్లాను పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని SSC యాక్షన్ ప్లాన్ తయారుచేశారు అని SC, ST ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు చవాన్ సుభాన్ సింగ్ అన్నారు. ఎప్పటికప్పుడు SSC విద్యార్థుల ప్రగతిని మధింపు చేయడానికి రెగ్యులర్ టెస్టులతో కలిపి అదనంగా రెండు క్యూములేటివ్ పరీక్షలను మరియు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించడం వలన విద్యార్థులకు ఫలితాల్లో బాగా ఉపయోగ కరంగా ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దాపురం దుర్గయ్య అన్నారు. అదేవిదంగా జిల్లాను రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మొదటిస్థానంలో తేవడానికి కృషి చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు కుర్రి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు మొగులయ్య, జిల్లా కార్యదర్శి బస్వాపురం మల్లేశం, హత్నూర మండల ప్రధాన కార్యదర్శి జైపాల్, పటాన్చెరు మండల అధ్యక్షులు నాగేశ్వర్ రావు, కొండాపూర్ మండల అధ్యక్షులు మనోహర్ పాల్గొన్నారు.
Comment List