గంగూలీ రాజీనామా ఫేక్

On

గంగూలీ రాజీనామా ఫేక్ Ganguly’s resignation is fake : బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా రాజీనామా చేశాడంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడనే వార్త ఫేక్ అని తేలిపోయింది. అతని స్థానంలో ప్రస్తుత కార్యదర్శి పదవిలో ఉన్న జై షా అధ్యక్షుడిగా ఎన్నికవ్వనున్నాడంటూ కొందరు ఆకతాయిలు బీసీసీఐ పేరుతో ఉన్న ఫేక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. కానీ వాస్తవానికి బీసీసీఐ అధికారిక ట్విటర్‌ నుంచి గంగూలీ రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో గంగూలీ […]

గంగూలీ రాజీనామా ఫేక్

Ganguly's resignation is fake : బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా రాజీనామా చేశాడంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడనే వార్త ఫేక్ అని తేలిపోయింది.  అతని స్థానంలో ప్రస్తుత కార్యదర్శి పదవిలో ఉన్న జై షా అధ్యక్షుడిగా ఎన్నికవ్వనున్నాడంటూ కొందరు ఆకతాయిలు బీసీసీఐ పేరుతో ఉన్న ఫేక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. కానీ వాస్తవానికి బీసీసీఐ అధికారిక ట్విటర్‌ నుంచి గంగూలీ రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో గంగూలీ రాజీనామా అనేది ఫేక్‌ అని తేలిపోయింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్‌ పదవిని చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో గంగూలీ ఐసీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకోవాలంటే.. ఓకే సమయంలో రెండు పదవుల్లో ఉండడం సమజసం కాదు గనుక బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.  దీన్ని ఆధారంగా చేసుకుని సౌరవ్ గంగూలీ వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటున్నాడని.. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా... అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నట్టు కోహ్లి అభిమానులే ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేశారంటూ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

Views: 14
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News